: ఇంకెన్నాళ్లు శాంతికపోతాలు ఎగరేస్తాం... ఇకపై చేతులు ముడుచుకుని కూర్చోం: రాజ్ నాథ్


ఉగ్రవాదానికి ఊతమివ్వడమే కాక, అకారణంగా దాడులకు దిగుతున్న పాకిస్థాన్ పై కేంద్రం ప్రత్యక్ష పోరు మొదలుపెట్టింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశం రెచ్చగొడుతున్నా ఇంకెన్నాళ్లు శాంతికపోతాలు ఎగురవేస్తామని ప్రశ్నించిన ఆయన, ఇకపై చేతులు ముడుచుకుని కూర్చునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారత సరిహద్దును పరిరక్షిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు కూడా ఇదే సందేశాన్ని పంపించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై చేతులు ముడుచుకుని కూర్చోకుండా ప్రతిదాడులకు దిగి, చొరబాట్లకు యత్నిస్తున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాక్ సైన్యానికి తగిన బుద్ధి చెప్పాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. ముంబైపై మరోమారు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాజ్ నాథ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News