: గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్తత... లారీ ఓనర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట


ఏపీ, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల లారీ ఓనర్లు, డ్రైవర్లు మహా ధర్నాకు దిగారు. చెక్ పోస్టు వద్ద విజయవాడ-హైదరాబాదు రహదారిని దిగ్బంధించిన నిరసనకారులు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకానొక సందర్భంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట కూడా జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన పోలీసు అధికారులు అక్కడికి పెద్ద సంఖ్యలో బలగాలను తరలించారు.

  • Loading...

More Telugu News