: మల్లి మస్తాన్ బాబు కుటుంబానికి జగన్ పరామర్శ


పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. పర్వతారోహణలో భారత కీర్తి ప్రతిష్ఠలను పతాకస్థాయికి చేర్చిన మల్లి మస్తాన్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అండీస్ పర్వతారోహణకు వెళ్లిన ఆయన అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మంచుకొండల్లోనే తుదిశ్వాస విడిచారు. అక్కడి నుంచి ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నేడు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీసంగం వెళ్లిన వైఎస్ జగన్, మల్లి మస్తాన్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News