: శివాజీ... వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు: ఏపీ మంత్రి మాణిక్యాల రావు వార్నింగ్!


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ పోరుబాట పట్టిన సినీ నటుడు, బీజేపీ నేత శివాజీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్నటికి నిన్న శివాజీ అసలు బీజేపీ నేతనే కాదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు కూడా శివాజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు. సోము వీర్రాజు ఎవరని ప్రశ్నిస్తున్నావు. పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న వీర్రాజును ప్రశ్నించడం సరికాదు. ఇప్పటికైనా వైఖరి మార్చుకో. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు’’ అని కొద్దిసేపటి క్రితం శివాజీకి ఆయన వార్నింగిచ్చారు.

  • Loading...

More Telugu News