: నాథూరాం గాడ్సే జీవితంపై సినిమా
మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే జీవితంపై సినిమా రూపొందనుంది. 'గాడ్సే ట్రయిల్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. గాడ్సే పాత్రలో టీవీ నటుడు దర్శన్ పాండ్య చేస్తున్నాడు. విజయ్ కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా, అలోక్ అరబింద్ ఠాకూర్, ఆదిత్య జోషి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గాడ్సే జైల్లో ఉన్నప్పటి రోజుల విశేషాలను, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు.