: హైదరాబాదులో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్... రివాల్వర్, బుల్లెట్ల స్వాధీనం


నిన్న సిమీ ఉగ్రవాాదులు, నేడు కిడ్నాపర్లు హైదరాబాదు నగరంలో హల్ చల్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపి, ఆ తర్వాత జానకీపురం ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులిద్దరూ హైదరాబాదు నుంచే వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. నాటి దాడిలో ముగ్గురు ఉగ్రవాదులున్నారని చెబుతున్న పోలీసులు మూడో ఉగ్రవాది కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం పోలీసులకు ఓ కిడ్నాపర్ల ముఠా పట్టుబడింది. ఓ మాజీ మావోయిస్టుతో పాటు మరో ముగ్గురు సభ్యులున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఓ రివాల్వర్ తో పాటు 40 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని బడా రియల్టర్లు, వ్యాపారవేత్తలు, బంగారం వ్యాపారులను అపహరించి భారీ ఎత్తున డబ్బు డిమాండ్ చేసేందుకు ఈ ముఠా పక్కాగా ప్రణాళికలతోనే నగరంలో అడుగుపెట్టిందట.

  • Loading...

More Telugu News