: కాంగ్రెస్, బీజేపీలు దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి: మాయావతి
దేశంలో అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు అంబేద్కర్ ను అవమానించాయని మండిపడ్డారు. అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో మాయావతి ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ఎప్పుడూ ఆయనకు గౌరవం ఇవ్వలేదని, కేవలం ఎన్నికల మస్కట్ గానే ఉపయోగించుకున్నారని ఆరోపించారు."వాళ్లెప్పుడూ (రాజకీయ పార్టీలు) అంబేద్కర్ కు సరైన గౌరవం ఇవ్వలేదు. అంబేద్కర్ వార్షికోత్సవం నిర్వహించడంలో వారంతా బయటకు ఓ డ్రామా ప్రదర్శిస్తుంటారు" అని మాయ విమర్శించారు.