: కేన్సర్ తో తమిళ సినీ నటి అంజనా మృతి
తమిళ సినీ నటి హనీ శివరాజ్ అంజనా కన్నుమూశారు. కొంతకాలం నుంచి కేన్సర్ తో బాధపడుతున్న ఆమె చిన్న వయసులోనే చనిపోయారు. ఆమె ఆకస్మిక మరణంపై తమిళ, మలయాళ సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళంలో హీరో కార్తీ చేసిన 'బిర్యానీ' చిత్రంలో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిగా అంజనా నటించింది. ఆ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు ఆమె మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అంజనా మంచి ప్రతిభ ఉన్న నటి అనీ, చిన్న వయసులోనే పరిశ్రమకు దూరం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అంజనా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.