: 9 నెలల్లో 11 దేశాల్లో పర్యటనలా?: మోదీపై దీదీ నిప్పులు
ఫ్రాన్స్, జర్మనీ పర్యటనలో బిజీగా ఉన్న ప్రధాని మోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మోదీ తన 9 నెలల పాలనలో తనకు 11 విదేశీ పర్యటనలు తప్ప మరేమీ కనబడటం లేదని ఆమె విమర్శించారు. దేశాలు పట్టుకు తిరిగితే ఇండియాను ఎవరు చూడాలని ఆమె తీవ్రంగా విమర్శించారు. భూసేకరణ బిల్లు విషయంలో మోదీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో నడుస్తోందని, ప్రధాని డిపార్ట్ మెంట్ గా మారిందని విమర్శించారు. ఆయన ఆదేశాలతోనే సీబీఐ తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తోందని దీదీ ఆగ్రహంతో ఊగిపోయారు.