: అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోదీ, కేజ్రివాల్!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ లకు స్థానం లభించింది. 'టైమ్' పత్రిక నిర్వహించిన ఈ పోల్ లో టాప్ 5 స్థానాల్లో నలుగురు పాప్ స్టార్ లు ఉండడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్ 6.95% ఓట్లతో మొదటి స్థానంలో నిలువగా, ఆ తరువాత ఉత్తర కొరియాకు చెందిన రాపర్ సింగర్ సిఎల్, పాప్ స్టార్ లు లేడీ గాగ, రిహానా, టేలర్ స్విఫ్ట్ లు కొనసాగారు. మోదీకి 0.6%, కేజ్రివాల్ కు 0.5% ఓట్లు వచ్చినట్టు 'టైమ్' తెలిపింది. ఇంకా ఈ జాబితాలో ఒబామా, ఆయన భార్య మిచెల్, హిల్లరీ క్లింటన్, దలైలామా, హ్యారీ పోటర్ నటి ఎమ్మా వాట్సన్, ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ళ, అమెరికాలో పేరున్న భారత డాక్టర్ వివేక్ మూర్తి తదితరులు నిలిచారు.