: రాజధాని ప్రాంత రైతులకు ఈ నెల 25లోపు రుణమాఫీ వర్తింపు: మంత్రి నారాయణ


ఏపీ రాజధాని ప్రాంత రైతులకు ఈ నె 25లోపు రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. రుణమాఫీపై బ్యాంకర్లతో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు. దానిపై బ్యాంకర్లు, రైతులతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సమావేశమై మాట్లాడారని చెప్పారు. అటు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం సేకరించిన 28వేల ఎకరాల భూముల్లో సర్వే పూర్తి చేశామన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు వారిళ్లకు వెళ్లి కౌలు పరిహారం చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో ఈ నెల 16న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పర్యటిస్తారని నారాయణ వివరించారు. భూములను చదునుచేసే రైతులకు పత్తిపంటకు ఎకరానికి రూ.500, మొక్కజొన్నకు రూ.1000 ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News