: అగ్ర రాజ్యాల ముందు మోకరిల్లుతున్న మోదీ: ప్రకాశ్ కారత్
అమెరికా తదితర అగ్ర రాజ్యాల ఒత్తిళ్లకు తలోగ్గేలా మోదీ విదేశాంగ విధానం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ విమర్శించారు. నేటి ఉదయం విశాఖపట్నంలో ఆ పార్టీ 21వ జాతీయ మహాసభలు ప్రారంభం కాగా, కారత్ మాట్లాడుతూ, మోదీ అగ్ర రాజ్యాల ముందు మోకరిల్లుతున్నాడని దుయ్యబట్టారు. దేశంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం మినహా గత 10 నెలల్లో మోదీ సాధించిన ఘనకార్యమేమీ లేదని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. పంట దిగుబడికి మద్దతు ధర లభించక కొందరు, అకాల వర్షాలకు పంటను కోల్పోయి మరికొందరు రైతులు నిరాశగా ఉన్నారని, వారిని తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.