: దేశ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళులు


డా.బీఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అంబేద్కర్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు ఇటు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు పలుచోట్ల జరిగాయి. టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో, ఏపీ కాంగ్రెస్ నేతృత్వంలో అనంతపురం జిల్లా మడకశిరలో అంబేద్కర్ కు పార్టీల నేతలు నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కు పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ మధుసూదనాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో 'క్యాస్ట్ ఫర్ ఫ్రీ ఇండియా' పేరుతో నడక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News