: పిల్లలపై ప్రతాపం చూపిన రౌడీషీటర్
చెప్పినపని చేయలేదన్న అక్కసుతో ముక్కుపచ్చలారని చిన్నారులపై ప్రతాపం చూపాడో రౌడీషీటర్. ఈ ఘటన సికింద్రాబాదు పరిధిలోని తుకారంగేట్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఐదుగురు అబ్బాయిలను తన ఇంట్లోని గదిలో రాత్రంతా నిర్బంధించి ప్లాస్టిక్ పైపుతో చితకబాదాడు. వీరందరికీ చర్మం చీరుకుపోయి వాతలు పడ్డాయి. తమ పిల్లలను తీవ్ర హింసలకు గురిచేశాడంటూ, రౌడీషీటర్ వెంకటస్వామిపై బాధిత చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల ఒంటిపై గాయాలకు చలించిపోయిన పోలీసులు వెంటనే స్పందించి కేసును తీవ్రంగా తీసుకున్నారు. రౌడీషీటర్ వెంకటస్వామిని, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపారు.