: ఏపీ మంత్రి పల్లె నివాసం ఎదుట సీపీఐ కార్యకర్తల నిరసన
అనంతపురంలోని ఏపీ ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ ఉదయం మంత్రి నివాసం వద్దకు వెళ్లిన వారు తీవ్ర ఆందోళన చేశారు. హెచ్ఎల్ సీ ఆధునికీకరణ పనులు వెంటనే చేపట్టాలని మంత్రిని డిమాండ్ చేశారు. దానిపై మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా పల్లె తిరస్కరించారు. దాంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఆ పత్రాలను మంత్రి ఇంటి గోడకు అంటించి వెళ్లిపోయారు.