: అమరావతిలో రోజుకు రూ. 10 లక్షలు తగ్గుతున్న భూముల ధర: ఏపీ మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో భూముల ధర రోజుకు రూ. 10 లక్షలు తగ్గిపోతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం విపక్షాల ఆరోపణలేనని ఆయన విమర్శించారు. అమరావతి సమీపంలో పొలాలను అమ్ముకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలం అందాలంటే పొలాలు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. రాజధాని భూముల్లో 9.2 ఫారాలు ఇచ్చినవాళ్లు అతి కొద్దిమంది మాత్రమేనని నారాయణ చెప్పారు.