: బిడ్డ వైద్యానికి డబ్బులేక తల్లిదండ్రుల 'హృదయ విదారక' నిర్ణయం


భూమిపై పడ్డప్పటి నుంచి ఆ చిన్నారికి ఆరోగ్య సమస్యలే. బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేని తమ దైన్య స్థితికి ఆ తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. ఆడుకునేవారు లేక అలమటించారు. చివరికి పాలలో విషం కలిపి ఆ బిడ్డ ప్రాణం తీసి, తామూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి పైలోకంలోనైనా కలసి ఉండాలని వెళ్ళిపోయారు. మనసును మెలిపెట్టే ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు, గిరింపేట గాంధీనగర్‌ లో జరిగింది. రవాణా శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న ఈశ్వరరావు (31), రజని (24) దంపతులు. వీరికి ఐదు నెలలక్రితం కొడుకు రిత్విక్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచి బాలుడు న్యుమోనియాతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. దీంతో ఇక బిడ్డను బతికించుకోలేమని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రజని ప్రస్తుతం 3 నెలల గర్భవతి అని, కడుపులో మగపిల్లాడు ఉన్నాడని పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు చెప్పారు. ఈ విషయం వారికి ముందే తెలిస్తే, ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉండేవారు కాదని బంధువులు విలపించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News