: అమెరికన్లు ఎక్కడున్నా వదిలిపెట్టం: ఐఎస్ఐఎస్ హెచ్చరిక


ప్రపంచంలో అమెరికన్లు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని, అమెరికాను తగలబెట్టి సర్వ నాశనం చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. ఈ మేరకు ఘాటైన సందేశంతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది. సెప్టెంబర్ 11ను పునరావృతం చేస్తామని, అంతకన్నా భయంకరమైన దాడులు జరుగుతాయని హెచ్చరించింది. అమెరికన్ పౌరులను తమ నుంచి కాపాడలేరని తెలిపింది. కాగా, ఈ వీడియోలో లాడెన్ ను కీర్తిస్తూ ఒక పాట వినిపిస్తుండగా, బాంబులను పేలుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులను నమ్ముకొని అమెరికన్లు తమపై దాడులు జరగవని నమ్ముతున్నారని, ఆ నమ్మకం ఎంతోకాలం ఉండదని తెలిపింది.

  • Loading...

More Telugu News