: డబ్బులతో అమరావతికి రండి... చైనా కంపెనీకి చంద్రబాబు ఆహ్వానం


కంపెనీలు పెట్టాలన్న ఉద్దేశంతో చేతిలో డబ్బుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కాలుపెట్టిన వారికి అవసరమైన సకల ఏర్పాట్లూ దగ్గరుండి చూస్తామని, త్వరితగతిన అనుమతులు, భూ సేకరణ పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరలో ఉత్పత్తి మొదలయ్యేట్టు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. చైనా పర్యటనలో మూడో రోజున చైనా హార్బర్ ఇంజనీర్ కంపెనీ బృందంతో బాబు సమావేశం జరిపారు. అమరావతికి వచ్చి అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించాలని వారిని కోరారు. ఆంధ్రాలో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయని, కేవలం పెట్టుబడితో వస్తే చాలని ఆయన వివరించారు. కొత్త రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు తాము సిద్ధమని చైనా హార్బర్ ఇంజనీర్ కంపెనీ చైర్మన్ తెలిపారు.

  • Loading...

More Telugu News