: సొరంగాలు కావు... అబ్బురపరిచే భూగర్భ మహల్ అది!


చార్మినార్ సమీపంలో రెండురోజుల క్రితం వెలుగులోకి వచ్చినవి సొరంగాలు కావని, 400 ఏళ్ల క్రితం అద్భుత రీతిలో నిర్మించిన భూగర్భ మహల్ అని అధికారులు తేల్చారు. తవ్వకాలు పూర్తయితే ఈ విషయమై మరింత స్పష్టత వస్తుందని పురావస్తు శాఖ అధికారులు వివరించారు. కులీకుతుబ్‌ షా కాలం నాటిదిగా భావిస్తున్న ఈ మహల్ నర్తకీమణుల నాట్య ప్రదర్శనల కోసం నిర్మించారా? లేక విశ్రాంతి భవనమా? అనేది పరిశోధిస్తామని తెలిపారు. తవ్వకాల్లో వెలుగుచూసిన రెండు మార్గాలూ, మహల్‌లోకి ప్రవేశించే ద్వారాలా? లేక గాలి, వెలుతురు కోసం ‘ఆర్చ్’ (కమాన్) నిర్మించారా? అనే కోణంలో పరిశోధన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అది ఆర్చ్ అయితే మహల్ మరింత లోతున ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News