: షార్‌ లో కంప్యూటర్‌ మాయం... ఆందోళనలో అధికారులు!


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్‌) లో విలువైన సమాచారం ఉన్న కంప్యూటర్‌ మాయం కావడం కలకలం రేపింది. ప్రథమ ప్రయోగ వేదిక వద్ద ఉండే కంప్యూటర్‌ కనిపించడం లేదని సమాచారం. ఇందులో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం ఉండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరగ్గా కొందరు షార్‌ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై షార్‌ భద్రతా విభాగం సిబ్బంది విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. సీసీ టీవీ ఫుటేజ్ లను వీరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News