: తిరిగొచ్చిన బర్డ్‌ఫ్లూ... నేడు 80 వేల కోళ్లను వధించనున్న అధికారులు!
హైదరాబాదులోని కోళ్లఫారంలలో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) బయట పడింది. హయత్ నగర్ లోని కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు పూణే ల్యాబ్ నిర్ధారించింది. ఈ కోళ్ల ఫారంలోని 80 వేల కోళ్లకి వైరస్ సోకినట్టు తెలుసుకున్న అధికారులు వీటిని నేడు వధించాలని నిర్ణయించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో హైదరాబాదుతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కొన్ని రోజులపాటు చికెన్ ప్రియులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.