: హైదరాబాదులో భారీ వర్షం... పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు హైదరాబాదునూ అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం, కొద్దిసేపటి క్రితం తీవ్రరూపం దాల్చింది. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం నగరంలోని పలు ప్రాంతాలను భారీగా ముంచెత్తింది. నగరంలోని అమీర్ పేట, కూకట్ పల్లి, మూసాపేట, ఎర్రగడ్డల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఈసీఐఎల్, కుషాయిగూడ, తార్నాక, నాచారం, మల్కాజిగిరి, సతన్ నగర్, ఎస్ఆర్ నగర్ లలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.