: రాందేవ్ బాబాకు కేబినెట్ హోదా... ట్విట్టర్ లో ప్రకటించిన హర్యానా మంత్రి!
యోగా గురు రాందేవ్ బాబాకు కేబినెట్ హోదా దక్కింది. హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రాందేవ్ బాబాకు కేబినెట్ హోదా కల్పించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నేడు ట్విట్టర్ లో ప్రకటించారు. రాందేవ్ బాబా పర్యవేక్షణలో రాష్ట్రంలో యోగా విద్యను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన అనిల్ విజ్, సర్కారీ స్కూళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో యోగ శాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాఠ్యాంశాల్లోనూ యోగా విద్యను చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మతపరమైన సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అనిల్ విజ్ ప్రకటనపై నిరసన వ్యక్తం చేసింది.