: కేసీఆర్ తో రామోజీరావు భేటీ... విశేషమేమీ లేదంటున్న ఈనాడు అధిపతి!


ఈనాడు దినపత్రిక, రాంమోజీ ఫిలిం సిటీ అధిపతి చెరుకూరి రామోజీరావు నేడు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. నేటి సాయంత్రం సచివాలయంకు వచ్చిన రామోజీరావు, కేసీఆర్ తో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామోజీ ఫిలిం సిటీలో కొత్తగా ఏర్పాటవుతున్న ఓం సిటీకి సంబంధించిన పుస్తకాన్ని రామోజీ, కేసీఆర్ కు అందజేశారు. అనంతరం బయటకు వచ్చిన రామోజీ, మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ ‘‘కేసీఆర్ ను కలవడంలో ప్రాధాన్యం ఏం లేదు... ఊరికే కలిశాను’’ అంటూ వ్యాఖ్యానించారు. గత డిసెంబర్ లో హైదరాబాదు నగర శివారులోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన కేసీఆర్, అక్కడే ఐదు గంటల పాటు గడిపారు. ఆ సందర్భంలోనూ రామోజీరావు ఓం సిటీకి సంబంధించిన పుస్తకాన్ని కేసీఆర్ కు అందించారు. తాజాగా నేటి భేటీ సందర్భంగానూ అదే పుస్తకాన్ని మరోమారు రామోజీ, కేసీఆర్ కి ఇచ్చారు.

  • Loading...

More Telugu News