: గేల్ ఔట్... ఇక బెంగళూరు బాధ్యతంతా కోహ్లీ, కార్తీక్ లదే!


సిక్సర్ల హీరో క్రిస్ గేల్, తొలి ఓవర్ లోనే తన అరుదైన రికార్డును చరిత్ర పుటల్లోకి ఎక్కించి ఆరో ఓవర్ లో వెనుదిరిగాడు. దీంతో భారీ స్కోరు చేస్తాడనుకున్న గేల్ (21) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిరాశ చెందింది. గేల్ తో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (25) కాస్త నెమ్మదిగా ఆడుతున్నాడు. ఆరో ఓవర్ లో ప్రవీణ్ కుమార్ వేసిన బంతిని ఎదుర్కొన్న గేల్ ఆశిష్ రెడ్డి చేతికి చిక్కాడు. దీంతో గేల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (8) ధాటిగానే ఆడుతున్నాడు. గేల్ స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో బెంగళూరు బాధ్యత అంతా కోహ్లీ, కార్తీక్ పైనే పడింది. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు ఓ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News