: చైనా బుల్లెట్ రైళ్లు, నదుల అనుసంధానం స్ఫూర్తిదాయకం: చైనాలో భారత మీడియాతో చంద్రబాబు
చైనాలో అత్యంత వేగంగా దూసుకెళ్లే రైళ్లు, భారీ ఎత్తున జరిగిన నదుల అనుసంధానం స్ఫూర్తిదాయకమని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితం అక్కడ ఉన్న భారత మీడియా ప్రతినిధులతో ముఖాముఖీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలను ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో నూతనంగా ఏర్పాటు కానున్న రాజధాని అమరావతి నుంచి రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల రాజధానులకు ఏర్పాటు కానున్న రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పారు. కొత్తగా అందుబాటులోకి రానున్న రహదారులు రాష్ట్ర ప్రగతి రూపురేఖలను మార్చేస్తాయని ఆయన పేర్కొన్నారు.