: ‘గల్లా’కు గుంటూరు కోర్టులో షాక్... ఒలింపిక్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా గల్లా ఎన్నిక నిలిపివేత!


గుంటూరు పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కు గుంటూరు కోర్టులో షాక్ తగిలింది. ఒలింపిక్ రాష్ట్ర సంఘం అద్యక్షుడిగా ఆయన ఎన్నికను గుంటూరు న్యాయస్థానం నిలిపివేసింది. ఈ నెల 5న తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో ఒలింపిక్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొంతమంది గుంటూరు న్యాయస్థానంలో గల్లా ఏకగ్రీవ ఎన్నికను సవాల్ చేశారు. ఈ మేరకు తన ముందుకు వచ్చిన పిటిషన్ ను విచారించిన గుంటూరు కోర్టు, గల్లా జయదేవ్ ఎన్నికను నిలిపివేస్తూ తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News