: వీహెచ్ ను తెలుగు ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు(వీహెచ్)ను తెలుగు ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. సత్యం కుంభకోణంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకూ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన వీహెచ్, వారిద్దరిపై విచారణ చేయాలని నేటి ఉదయం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీహెచ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కామినేని, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దల కాళ్లు పట్టుకునే వీహెచ్, వెంకయ్యపై ఆరోపణలు గుప్పించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్యపై ఆరోపణ చేసే స్థాయి వీహెచ్ కు లేదని కూడా కామినేని అన్నారు.