: 26/11 దాడుల విచారణకు గడువు విధించిన పాకిస్థాన్ కోర్టు
26/11 ముంబయి దాడుల కేసు విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టు గడువు విధించింది. ఈ మేరకు జస్టిస్ నూరుల్ హక్ ఖురేషీ నేతృత్వంలోని ధర్మాసనం, 2 నెలల్లోగా ఈ కేసులో విచారణ పూర్తి చేయాలని ఇస్లామాబాద్ తీవ్రవాద వ్యతిరేక కోర్టును ఆదేశించింది. ఇదే సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన జకీర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిిన పిటిషన్ పై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది. గడువులోగా విచారణ పూర్తి చేయకుంటే అప్పుడే లఖ్వీ బెయిల్ ను విచారణకు స్వీకరిస్తామని తెలిపింది. తదుపరి విచారణను రెండు నెలల వరకు వాయిదా వేసింది. పాకిస్థాన్ ప్రభుత్వం సరైన సాక్ష్యాలు చూపని కారణంగా లఖ్వీకి ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.