: హైదరాబాదులో దారుణం... బాల కార్మికులపై రౌడీ షీటర్ దాడి, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం
హైదరాబాదులో రౌడీ షీటర్ల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులను నిబంధనలకు విరుద్ధంగా నగరానికి తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయిస్తున్న రౌడీ షీటర్ల దురాగతాలు ఇటీవలి కాలంలో వెలుగుచూశాయి. తాజాగా నగరంలోని తుకారాంగేట్ కు చెందిన రౌడీ షీటర్ వెంకటస్వామి, పిల్లలతో వెట్టిచాకిరీ చేయించడమే కాక, చెప్పిన పనిచేయలేదని వారిని తీవ్రంగా కొట్టాడు. దీంతో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.