: సానియా మీర్జాకు ప్రశంసల వెల్లువ


టెన్నిస్ మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుకు చేరిన క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రధాని సహా పలువురినుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ మేరకు "సానియా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. డబుల్స్ లో నెంబర్ 1 ర్యాంకు సాధించినందుకు శుభాకాంక్షలు" అని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఫరాఖాన్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ దేశ్ ముఖ్, క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ తదితరులు సానియాకు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఘనతను కొనియాడారు.

  • Loading...

More Telugu News