: సోనియా చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేసీఆర్ కు లేఖ రాశాం: ఉత్తమ్ కుమార్


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చరిత్రను తెలంగాణ పాఠ్యాంశాల్లో చేర్పించేందుకు టీ.కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసినట్టు టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోనియావల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భూసేకరణ బిల్లులో సవరణల వల్ల కలిగే నష్టాలపై ఓ బుక్ లెట్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ కు దూరమైన వారిని మళ్లీ రప్పించుకునేందుకు డీఎస్ అధ్యక్షతన ఓ కమిటీ వేశామని తెలిపారు. తెలంగాణ ఇవ్వడం వల్లే సెటిలర్లకు కాంగ్రెస్ పై నమ్మకం తగ్గిపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలవల్లే మైనారిటీలు కాంగ్రెస్ కు దూరమవుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News