: చైన్ స్నాచర్ గా మారిన హోంగార్డు... 80 తులాల బంగారం స్వాధీనం
ప్రజారక్షణ బాధ్యతలు చూసే పోలీసులకు సహకారం అందించాల్సిన డ్యూటీ చేస్తూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నాడు. వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న హైదరాబాదు, జీడిమెట్లకు చెందిన హోంగార్డు మహేందర్ సింగ్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారించి 80 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. జల్సాలకు అలవాటు పడిన కారణంగానే మహేందర్ సింగ్ అధిక డబ్బు కోసం పెడదారి పట్టాడని పోలీసు అధికారులు తెలిపారు.