: చిరుతపులి ముందు పడ్డ రెండేళ్ల చిన్నారి... దూకి రక్షించుకున్న తల్లిదండ్రులు


చిరుతపులులు ఉన్న జూ ఎన్ క్లోజర్ లో ప్రమాదవశాత్తూ రెండేళ్ల చిన్నారి పడిపోగా, ఆ వెంటనే అత్యంత సాహసంతో అందులోకి దూకిన తల్లిదండ్రులు తమ గారాల ముద్దుబిడ్డను కాపాడుకున్నారు. ఒహియో జూలో అనేకులు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. చిరుతలను చూస్తూ, రెయిలింగ్ పై బిడ్డను కూర్చోబెట్టగా, వాడు కదిలి సుమారు 10 అడుగుల లోతున్న చిరుతలున్న గుంతలో పడ్డాడు. వెంటనే బాలుడి తల్లి, ఆపై తండ్రి అందులోకి దూకారు. కొన్ని నిమిషాల పాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది. ఈలోగా స్పందించిన జూ అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అంత ఎత్తు నుంచి పడడంతో బాలుడికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ చిరుత వారి దగ్గరికి రాలేదని జూ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News