: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: జగన్
కొన్నిరోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ప్రధానంగా రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇదే సమయంలో వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.