: ఉత్తరప్రదేశ్ రైతులకు 'మహా గొప్ప' నష్టపరిహారం!


అకాల వర్షాలతో వేలాది రూపాయల పంట నష్టపోయి దిగాలు పడ్డ రైతులను అవమానపరిచేలా ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రవర్తించారు. కష్టనష్టాల్లో ఉన్న రైతుల పుండుపై కారం చల్లారు. నష్ట పరిహారం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ రూ. 63, రూ. 84, రూ. 100 చెక్కులను రైతులకు ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఇది అధికారుల మతిలేని చర్యగా ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సుమారు ఎకరం పొలం ఉన్న మొహమ్మద్ సాబీర్ అనే రైతు గోధుమ పంట వేసి నష్టపోగా ఆయనకు రూ. 100 రూపాయల పరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. అర ఎకరం పొలంలో పంట నష్టానికి రూ. 63 ఇచ్చారని షాహిద్ అనే రైతు వాపోయాడు. రుడాలీ తాలూకాలోని మరో రైతుకు రూ. 84 నష్టపరిహారాన్ని గొప్పగా అందించారు. వీరంతా అధికారుల తీరును నిరసిస్తూ తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News