: నేను బీజేపీలో లేననడానికి సోము వీర్రాజు ఎవరు?: నటుడు శివాజీ
బీజేపీతో హీరో శివాజీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఇటీవల ఆ పార్టీ జాతీయ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ హోదాకోసం నిరసన దీక్ష చేస్తున్న సమయంలో ఆ పార్టీ నేత, నటుడు శివాజీ స్పందించారు. తాను బీజేపీలో లేననడానికి అసలు సోము వీర్రాజు ఎవరని ప్రశ్నించారు. ఎప్పుడో పోటీ చేస్తే వీర్రాజుకు కేవలం 7వేల ఓట్లు వచ్చాయని, తెలుగు ప్రజలకు అసలు ఆయనెవరో కూడా తెలియదని అన్నారు. తాను, కామినేని శ్రీనివాస్ బీజేపీలో ఒకేసారి చేరామని, తాను బీజేపీలో లేనంటే కామినేని కూడా లేనట్టేనిని శివాజీ అన్నారు.