: పవన్ కల్యాణ్ అన్నయ్యా... మీ శక్తి వాడండి, పోరాడండి: నటుడు శివాజీ
"పవన్ కల్యాణ్ గారిని నేను ఒక మాట అడగదలచుకున్నా. అన్నయ్యా... మీరు బ్రహ్మాండంగా చేశారు. ప్రజలకు మీ పట్ల చాలా అభిమానం ఉంది. చాలా అంటే చాలా. ఇవాళ నువ్వు రోడ్డు మీదకు వస్తే, కోట్లాది మంది రోడ్డు మీదకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రాజధాని మీద పోరాడారు. ఓకే, ఫైన్... మెజారిటీ ప్రజలను మనం గౌరవించాలి. చిన్న చిన్న సమస్యలుంటే మీరు సర్దగలరు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మీ కుటుంబాన్ని... మెగాస్టార్ కుటుంబాన్ని ఈరోజున ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు, భావి అవసరాలు కల్పించాలి. అంటే రేప్పొద్దున మనం మన పిల్లల కోసం ప్రణాళికలు ఏర్పాటు చేసుకునేలాగానే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా మీ పిల్లలాంటివారే కాబట్టి, బాధ్యత మీదే. నాకేం అన్నయ్యా... మీలాంటి వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా హెల్ప్ చేయడానికి ఎవరున్నారు వీళ్ళకి? మీరు పోరాడండి. మీరు పోరాడితే కచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ శక్తి అటువంటిది. దాన్ని వాడండి" అని నటుడు శివాజీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన కృష్ణా నదిలో దిగి ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.