: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్... అధికారిక ప్రకటన విడుదల... గెలిస్తే చరిత్రే!


"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి ప్రజలు కోరుకుంటున్న ఛాంపియన్గా నిలవాలనుకుంటున్నా" అని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ అధికారిక ప్రచార వెబ్ సైట్ లో ఒక వీడియోను రిలీజ్ చేశారు. దీంతో హిల్లరీ పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చినట్టయింది. కాగా దేశ అధ్యక్ష పదవి కోసం పోటీపడాలని హిల్లరీ మొదటిసారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న సంగతి తెలిసిందే. రెండోసారి ఆ అవకాశాన్ని దక్కించుకోవడంలో విజయం సాధించిన హిల్లరీ తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు. అందుకోసం న్యూయార్క్ లోని బ్లూక్లిన్ హైట్స్ లో ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. త్వరలో ఆమె ఓటర్లను కలుస్తారని, మేలో ఒక ర్యాలీని నిర్వహిస్తారని హిల్లరీ ప్రచార మేనేజర్ జాన్ పొడెస్తా తెలియజేశారు.

  • Loading...

More Telugu News