: పసిమొగ్గపై అత్యాచారం పట్ల నారా లోకేశ్ స్పందన
ఢిల్లీలో పసివాడని చిరు మొగ్గపై హేయమైన రీతిలో అత్యాచారం జరిగిన సంఘటనపై నారా లోకేశ్ స్పందించారు. ఈ సంఘటన అత్యంత బాధాకరమని లోకేశ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. నేరం జరిగిన తర్వాత పోలీసులు స్పందించిన తీరు దారుణమని అభిప్రాయపడ్డారు. లంచానికి ఆశపడి, కేసును మరుగున పడేసేందుకు ఢిల్లీ పోలీసులు యత్నించడం గర్హనీయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.