: మంగళగిరిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్!
నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతి సమీపంలో మంగళగిరి వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని తెలుగుదేశం సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని సింగపూర్ సంస్థ తయరుచేసిన రాజధాని ముసాయిదా ప్రణాళికలో స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం సుమారు 5 వేల ఎకరాల భూమిని రిజర్వ్ చేశారు. గతంలో వాడరేవు - నిజాంపట్నం పోర్టు - పారిశ్రామిక కారిడార్ (వాన్ పిక్) కాంట్రాక్టు తీసుకున్న సంస్థకే ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో కీలక భూమిక అప్పగించనున్నట్టు సమాచారం.