: టాస్ గెలిచిన ముంబై...పంజాబ్ బ్యాటింగ్
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో సెహ్వాగ్, మ్యాక్స్ వెల్, మిల్లర్, బెయిలీ, మురళీ విజయ్ లాంటి స్టార్ ఆటగాళ్లుండగా, ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్, ఫించ్, కోరె ఆండర్సన్, పోలార్డ్, రాయుడు వంటి స్టార్లున్నారు. రెండు జట్లు తమ తొలి మ్యాచ్ లో పరాజయం పాలవ్వడంతో విజయమే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ముంబైకి అభిమానుల మద్దతు లభించనుండగా, పంజాబ్ లోని పలువురు ఆటగాళ్లకు ప్రాంతాలకతీతంగా అభిమానులున్నారు.