: వికార్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై విచారణకు కేసీఆర్ ఆదేశం...ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గారా?


తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరంగల్- నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ సహా మరో ఐదుగురు చనిపోయారు. అది బూటకపు ఎన్ కౌంటర్ అని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వికార్, అతడి అనుచరుల్ని కాల్చి చంపారంటూ ఎంఐఎం సహా, పలువురు ముస్లిం మత పెద్దలు సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు కేసీఆర్ ఆదేశించడం విశేషం.

  • Loading...

More Telugu News