: హైదరాబాదు నడిబొడ్డున చార్మినార్ ప్రాంతంలో బయటపడ్డ సొరంగాలు
హైదరాబాదు నడిబొడ్డున సొరంగం బయటపడింది. పాతబస్తీలోని చార్మినార్ దగ్గర బండీకా అడ్డా ప్రాంతంలో భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మూడు సొరంగాలు బయటపడడం స్థానికంగా సంచలనం రేపింది. వీటిని చూసిన స్థానికులు పురావస్తుశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు పరిశీలించేందుకు వెళ్లారు. కాగా, సొరంగం బయటపడిందన్న వార్త ఆనోటా ఈనోటా పాకి, వాటిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. భవన యజమాని మాట్లాడుతూ, నిజాం సేనలు విశ్రాంతి తీసుకునేందుకు ఇలాంటి సొరంగాలు చాలా నిర్మించారని అభిప్రాయపడ్డారు. వీటిని రహస్య మార్గాలుగా భావించడం లేదని ఆయన చెప్పారు.