: ట్యాక్సీ డ్రైవర్ పై బ్రిటిష్ మహిళ ఫిర్యాదు


ట్యాక్సీ డ్రైవర్ల తీరులో మార్పురావడం లేదు. దేశంలో ఏదో ఒకచోట మహిళలపై డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలో సలీం (20) అనే ట్యాక్సీ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ బ్రిటిష్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సలీంను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన సలీం ఢిల్లీలో ట్యాక్సీ నడుపుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై ఐపీసీ 354కింద కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. బ్రిటిష్ మహిళతో పాటు ఆమె సహచరుల వాంగ్మూలం నమోదు చేసినట్టు, విచారణ తీవ్రం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News