: ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ అరుదైన కానుక


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన కానుకను బహూకరించారు. తన మొట్టమొదటి ఫ్రాన్స్ పర్యటనను పురస్కరించుకుని మోదీ 'ట్రీ ఆఫ్ లైఫ్' అనే చిత్రపటాన్ని ఫ్రాంకోయిస్ హోలాండేకు అందజేశారు. పురాతన సంస్కృతి, సంప్రదాయాల్లో భారతీయులు ప్రకృతిని ఎంత ఆరాధించారో ఈ చిత్రపటం చెబుతుంది. ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు భాస్కర్ మహాపాత్రొ దీనిని పట్టువస్త్రంపై రూపొందించారు. దీనిని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందజేశారు.

  • Loading...

More Telugu News