: టీఆర్ఎస్ అధ్యక్షపదవికి 20న నామినేషన్లు స్వీకరిస్తాం: నాయిని


టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవికి ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తామని అన్నారు. 23న ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని ఆయన చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో పాల్గొనే వ్యక్తుల వివరాలు వెల్లడిస్తామని, పోటీ లేని పక్షంలో విజేతను ప్రకటిస్తామని అన్నారు. పోటీలో మిగిలిన వారి మధ్య 24న ఎల్బీ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తామని నాయిని వెల్లడించారు.

  • Loading...

More Telugu News