: యూపీఏ ప్రభుత్వంపై పారిస్ లో మోదీ విమర్శలు


యూపీఏ గవర్నమెంట్ బొగ్గు గనులను హ్యాండ్ కర్చీఫ్ లు, పెన్నుల మాదిరిగా పంచేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పారిస్ లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎలాంటి విచారణ లేకుండా 204 బొగ్గుగనులను పెన్నులు, కర్చీఫ్ లులా పంచిందని అన్నారు. ఫలితంగా భారత ఖజానాకి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. తరువాత సుప్రీంకోర్టు కలుగజేసుకుని వాటిని రద్దు చేసిందని, బొగ్గు గనుల విషయంలో మాజీ ప్రధానిని కూడా తప్పు పట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పుడా విషయం జోలికెళ్లనని, దానిపై విమర్శించాలనుకోవడం లేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News