: మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది: రోశయ్య


చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళకూలీలపై జరిగిన ఎన్ కౌంటర్లపై ఎట్టకేలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య స్పందించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కాగా, శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News